కోవిడ్ - 19 నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పాక్షిక కర్ఫ్యూ విధించిన దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల పని వేళల్లో మార్పులు చేస్తున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ కె. మన్మధరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తేది 5.5.2021 నుండి 18.5.2021 వ తేది వరకు కర్ఫ్యూ సందర్భంగా ఉదయం గంటలు 7.30 ని. ల నుండి మధ్యాహ్నం 2.00 గంటలు వరకు పని దినాలలో మాత్రమే కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ఒక ప్రకటనలో వివరించారు. ఉదయం గం.లు 11.30 ని. ల నుండి మధ్యాహ్నం 2.00 గంటలు వరకు రిజిస్ట్రేషన్ చేయించుకొనే వారు తప్ప, సాధారణ ప్రజలు ఎవరూ కార్యాలయ ఆవరణలోకి ప్రవేశించకూడదని తెలిపారు. కోవిడ్ - 19 దృష్ట్యా కర్ఫ్యూ ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పనివేళల్లో మార్పులు చేయడం జరిగిందని ప్రజలు గమనించి సహకరించవలసినదిగా ఆయన కోరారు.