ఆరు రోజులు అప్పదర్శనాలకు సెలవు..
Ens Balu
3
సింహాచలం
2021-05-07 13:57:56
శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి దేవాలయంలో ఈ నెల 10వ తేదీ నుంచి 15 వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేసినట్టు ఈఓ సూర్యకళ తెలియజేశారు. శుక్రవారం ఆమె సింహాచలంలో మీడియాలో మాట్లాడారు. కరోనా నేపథ్యంలో అర్చకుల విజ్ఞప్తి మేరకు, ధర్మకర్తల మండలి ఆమోదంతో ఆలయాన్ని (భక్తులకు) మూసివేయాల నిర్ణయించామన్నారు. కాగా స్వామివారి చందనోత్సవాన్ని ఏకాంతంగానే నిర్వహించనున్నామని చెప్పారు. స్వామివారికి జరగాల్సిన అన్ని కార్యక్రమాలూ ఉదయం ఆరాధన నుంచి రాత్రి పవళింపు వరకు యథావిథిగానే ఏకాంతంగానే జరుగుతాయన్నారు. స్వామివారి సేవలకు ఎలాంటి లోటు ఉండబోదన్న ఈఓ 10-05-21 నుంచి 15-05-21 వరకు భక్తులెవరూ సింహాచలం కొండపైకి రాకూడదని విజ్ఞప్తి చేశారు.