తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు కొవిడ్ సేవల నిమిత్తం జిల్లా రిలీఫ్ ఫండ్ కింద శుక్రవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ)డా. జి లక్ష్మీ శ సమక్షంలో జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి రూ.50 లక్షల చెక్కును కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి కి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విపత్తు సమయంలో జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ తరుపున రూ.50లక్షలు విరాళంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డీఎం ఈ లక్ష్మీ రెడ్డి, రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు ఎస్ రామారెడ్డి, వీ.సూర్య ప్రకాష్ , ఎం బుల్లి మోహన్ రెడ్డి, ఎన్వివి సత్యనారాయణ రెడ్డి,సీ బాబ్జి ,తదితరులు పాల్గొన్నారు.