కలెక్టర్ కోలుకోవాలని అప్పన్నకు పూజలు..


Ens Balu
1
సింహాచలం
2021-05-07 14:44:22

విశాఖజిల్లాలో నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ కోవిడ్ భారిన పడిన జిల్లా  కలెక్టర్  వి.వినయ్ చంద్ త్వరగా కోలుకోవాలంటూ సింహాచలంలో పూజలు నిర్వహించారు. శుక్రవారం ఈ ప్రాంతానికి చెందిన  సామాజిక వేత్త బాలభానుమూర్తి  ఆధ్వర్యంలో ప్రేరణ చారిటబుల్ ట్రస్టు చైర్మన్, జర్నలిస్ట్ జట్లీ స్థానికులు కలసి సింహాచలంలో అప్పన్న స్వామికి పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అహోరాత్రులు కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అందించాలని శ్రమించిన కలెక్టర్ త్వరగా కోలుకొని ప్రజలకు సేవలు చేయడానికి వచ్చేలా సింహాద్రి అప్పన్న ఆయనకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని స్వామిని కోరుకున్నట్టు చెప్పారు. అలాగే జీవియంసీ కమీషనర్ సృజన కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని  సింహాద్రి అప్పన్న తొలి పావంచా వద్ద తులసి మాల వేసి స్వామిని వేడుకున్నామన్నారు. జిల్లా అధికారులతో పాటు కో విడ్ తో పోరాడుతున్న ప్రజలంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు కూడా పాల్గొని కొబ్బరికాయలు కొట్టారు.

సిఫార్సు