పార్లమెంటులో అల్లూరి విగ్రహం ఏర్పాటుకి క్రుషి..


Ens Balu
3
రాజమండ్రి
2021-05-07 15:00:21

భారత స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీషు సేనలపై మూడేళ్లు ప్రత్యక్ష సాయుధ పోరాటం సాగించి, తెలుగు జాతి పౌరుష ప్రతాపాలను ప్రపంచానికి చాటిచెప్పిన  ‘విప్లవజ్యోతి’అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని పార్లమెంట్‌లో పెట్టేందుకు కృషిచేస్తానని రాజమహేంద్రవరం పార్లమెంట్‌ సభ్యులు,  వైసిపి చీఫ్‌ విప్‌ మార్గని భరత్‌రామ్‌ అన్నారు. శుక్రవారం స్థానిక గోదావరి గట్టున జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్లూరి నిలువెత్తు కాంస్య విగ్రహంవద్ద జరిగిన అల్లూరి 97వ వర్థంతోత్సవ కార్యక్రమంలో ఎంపి భరత్‌రామ్‌ ముఖ్య అతిధిగా పాల్గొని, పూలమావేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీతారామరాజు జీవించిన 27 సం॥రా కాలంలో 13 సంవత్సరాలు రాజమహేంద్రవరం గోదావరి గట్టు పరిసర ప్రాంతాల్లో జీవించడం రాజమహేంద్రవరం నగరానికే గర్వ కారణమన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి పార్లమెంట్‌లో అల్లూరి విగ్రహం ఏర్పాటుకు, అలాగే రాజమహేంద్రవరంలో అల్లూరి చరిత్రను గుర్తుచేసే విధంగా ఒక భారీ అభివృద్ధికి అల్లూరి పేరు పెడతామన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ, సీతారామరాజు కుటుంబం 13 సం॥రాకు పైగా గోదావరి గట్టు ప్రాంతంలో నివశించి ఆయన స్థానిక ఉల్లితోట బంగారయ్య స్కూల్లో చదువుకొన్నాడని, గోదావరి పుష్కరాల రేవులో ఆయన, ఆయన తండ్రి సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో స్నాన మాచరించే వారని గుర్తుచేశారు. సభకు అధ్యక్షత వహించిన జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు మాట్లాడుతూ, పాత రైల్వే (హేవ్‌లాక్‌ బ్రిడ్జి) బ్రిడ్జికి, అల్లూరి పోరాటానికి ముఖ ద్వారమైన రాజమహంద్రవరం ఎయిర్‌ పోర్టుకు అల్లూరి పేరుపెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరామన్నారు. అలాగే పార్లమెంట్‌లో అల్లూరి నిలువెత్తు కాంస్య విగ్రహం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విగ్రహాన్ని మా జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం రూపొందించి ఇవ్వడానికి సిద్దంగా వుందని, వీటిపై ఎంపి భరత్‌రామ్‌ కృషిచేయాలని పడాల కోరారు. దానిపై స్పందించిన ఎంపి భరత్‌ రామ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి అవి జరిగేటట్లు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  సంఘం ఉపాధ్యక్షుడు, పూర్వ ఫారెస్ట్‌ అధికారి దంతులూరి సుబ్బరాజు, మాదేటి రవిప్రకాష్‌, జాతీయ కోశాధికారి బళ్ళా శ్రీనివాస్‌, కార్యదర్శి వెల్లా నాగార్జున, హర దీపక్‌, దల్లి శ్రీనివాసరెడ్డి, వైసిపి నాయకు మజ్జి అప్పారావు, గేడి అన్నపూర్ణరాజు, బ్డిర్‌ చిన్న, కె. ఓంకార్‌, మార్గాని బుజ్జి, ఉల్లూరి రాజు, పీతా రామకృష్ణ, మారిశెట్టి వెంకటేశ్వరరావు, గాడా తాతారావు, దూర్వాసు సత్యనారాయణ, రొక్కం వంశీ తదితరులు పాల్గొన్నారు.
గోరక్షణపేటలో పడాల రామారావు స్మారక స్థూపం వద్ద....
తొలుత  గోరక్షణపేట సెంటర్‌లో  స్వాతంత్య్ర సమరయోధుడు  పడాల రామారావు స్మారక మందిరం వద్ద వున్న ‘విప్లవజ్యోతి’అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు పూలమావేసి ఘనంగా నివాళి అర్పించారు. పడాల విగ్రహానికి దంతులూరి సుబ్బరాజు పూలమావేసి ఘనంగా నివాళి అర్పించారు. అలాగే గోరక్షణపేటలోని జాతీయ అల్లూరి సీతారామరాజు కార్యాలయంలో వున్న అల్లూరి విగ్రహానికి యువజన సంఘం జాతీయ కోశాధికారి బళ్ళా శ్రీనివాస్‌, పూలమావేసి ఘనంగా నివాళి అర్పించారు.
సిఫార్సు