కోవిడ్ నోడలధికారి సస్పెండ్..


Ens Balu
3
అనంతపురం
2021-05-07 15:13:51

అనంతపురం జిల్లా హిందూపురం జిల్లా ఆసుపత్రి నోడల్ అధికారి, హిందూ పురం డివిజనల్ కోఆపరేటివ్ అధికారి వి.రాజేంద్ర ప్రసాద్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. మెడికల్ ఆఫీసర్ల తో సమన్వయం చేసుకుంటూ ఆసుపత్రిలోని పేషేంట్ల రోజువారీ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడంలో విఫలమైనందున చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వులలో తెలిపారు. హిందూపురం డివిజనల్ కోఆపరేటివ్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న వి.రాజేంద్ర ప్రసాద్ ను గతంలో హిందూపురం జిల్లా ఆసుపత్రికి నోడల్ అధికారిగా నియమించారు. వైద్యాధికారుల సమన్వయంతో కోవిడ్ బాధితుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడంలో విఫలమవడంతో నోడల్ అధికారిని సస్పెండ్ చేసినట్లు కలెక్టర్  తెలిపారు.. కో విడ్ విపత్కర పరిస్థితుల్లో విధి నిర్వహణలో నిర్లక్ష్యం,అలసత్వం చూపిన కారణంగా నియమ నిబంధనల ప్రకారం సస్పెన్షన్ చేయడం జరిగిందన్నారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి నూతన నోడల్ అధికారిగా పెనుకొండ సబ్ కలెక్టర్ నిశాంతిని నియమించారు. కోవిడ్ విధుల్లో  నిర్లక్ష్యాన్ని సహించేది లేదని  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.. 
సిఫార్సు