పనులు ప్రారంభించకపోతే డిపాజిట్లు కోల్పోతారు..కమిషనర్


Ens Balu
2
Visakhapatnam
2020-08-26 19:37:25

మహా విశాఖ పరిధిలో అభివృద్ధి పనులకు టెండర్లు ఖరారై పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లు డిపాజిట్లు కోల్పోవలసి వస్తుందని జీవిఎంసీ కమిషనర్ డా.స్రిజన హెచ్చరించారు. ఐదు జోన్ల పరిధిలో రూ. 53260.19 లక్షలు ఎస్టిమేట్ లు తయారయ్యాయని ఆమె చెప్పారు. మంగళవారం ఇంజనీరింగ్ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. 7నెలలు గడిచినా చాలా పనులు ప్రారంభం కాకపోవడంపై ఇంజనీరింగ్ అధికారులను ప్రశ్నించారు. 25శాతం కంటే తక్కువగా పనులు చేసిన కాంట్రాక్టర్లు, ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామన్న కమిషనర్ అలాంటి వారిపై ఐదేళ్లు అనర్హత వేటు వేస్తామన్నారు. సుమారు 169 పనులకు సంబంధించి 5 జోన్లలలో టెండర్లు రద్దు చేసి మరోసారి పిలవడానికి కూడా నోటీసులు జారీ చేయాలన్నారు. కాంట్రాక్టు పనులు పొంది పనులు ప్రారంభించని వారిని బ్లాక్ లిస్టులో పెట్టాలని సిఈని ఆదేశించారు. పనులు పొందిన కాంట్రాక్టర్లతో దగ్గరుండి పనులు నాణ్యతగా చేయించాల్సిన బాధ్యత ఇంజనీరింగ్ అధికారులదే నన్నారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
సిఫార్సు