విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఈ నెల 14న చందనోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
ఏడాది పొడవునా సుగంధభరిత చందనము లో ఉండే స్వామి ఒక్క వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే భక్తులకు దర్శనం ఇస్తారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఏకాంతంగానే స్వామికి సేవలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సింహాద్రి నాధుడు చందన ప్రసాదం సమర్పణకు భక్తుల నుంచి ఆలయ వర్గాలు విరాళాలు కోరుతున్నాయి. ఈ మేరకు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు దంపతులు స్వామిని దర్శించుకుని మూడు కేజీలు చందన సమర్పణకు విరాళం అందజేశారు. రూ.60.348 వేల చెక్ రూపములో ఆలయ ఏ ఈఓ రాఘవ కుమార్ కు అందజేశారు. అందరి సహకారముతో ఉత్సవాలు మరింత విజయవంతం అవుతాయని శ్రీను బాబు ఆకాంక్షించారు. ఈ కార్య క్రమంలో స్థానాచార్యులు టిపి రాజగోపాల్, ఆలయ పురోహితులు అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు రాజీవ్ లోచన, సూపరెండెంట్ దాసరి బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు.