ఆసుపత్రుల సామర్ధ్యాన్ని పెంచండి..


Ens Balu
3
Kakinada
2021-05-08 11:23:16

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి  సంబంధించి ఎక్కువ సంఖ్యలో కోవిడ్ కేసులు వస్తున్నందున పడకల సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. శనివారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి  ఈఎన్టీ బ్లాక్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను, కోవిడ్ వార్డులను జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, వైద్య అధికారులతో కలిసి కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిజిహెచ్ కు వస్తున్న కోవిడ్ కేసుల సంఖ్యకు అనుగుణంగా పడకల సామర్ధ్యాన్ని పెంచడానికి అవసరమైన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. కోవిడ్ సోకి, జిజిహెచ్ లో వైద్యం పొందిన 5 రోజుల తర్వాత ఆరోగ్యం స్థిరంగా ఉన్నవారిని కోవిడ్ కేర్ సెంటర్లకు లేదా డిశ్చార్జి చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కోవిడ్ వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలు, వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.పి వెంకట బుద్ధ, ఆర్ఎమ్ఓ డా.ఈ గిరిధర్, జిజిహెచ్ నోడల్ అధికారి ఎమ్ .భాను ప్రకాష్ , ఇతర వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు