ఆలోచింపజేసిన దేవిశ్రీ 3రాజధానుల ఆటపాట...


Ens Balu
4
Andhra University
2020-08-27 15:33:05

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల అంశాన్ని సమర్ధిస్తూ, వాటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రజాగాయకుడు దేవిశ్రీ వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటపాట నిర్వహించారు. గురువారం ఆంధ్రాయూనివర్శిటీలోని వైఎస్సార్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మూడు రాజధానులపై దేవిశ్రీ పాడిన పాట అందరినీ ఆలోచింపజేసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న మూడు రాజధానుల వలన నిరుద్యోగ యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలు పెరగడంతోపాటు, ఉత్తరాంధ్రాపూర్తిస్థాయిలో అభివ్రుద్ధి జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.  కార్యక్రమానికి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఇ రమణారెడ్డి, బర్ల మంగరాజు, త్రినాద్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి,  షరీఫ్, నాగరాజు , పోలారావు వీరకుమార్, అప్పలనాయుడు, విజయ్, అప్పలరాజు, శివ, తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు