ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత రానివ్వకండి..


Ens Balu
1
Kakinada
2021-05-08 11:26:13

ఆక్సిజన్ కొరత రానివ్వకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి చెప్పారు. శనివారం కాకినాడ జిజిహెచ్ లో పర్యటంటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,  రెండు వారాల క్రితం 1.7 కేఎల్ పీయస్ఎ యూనిట్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. మరో వారం రోజుల్లో 10 కేయల్  సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ సిలిండర్ ను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.  దీని ద్వారా జిల్లాలో ఎక్కడ ఆక్సిజన్ కొరతా లేకుండా ఉంటుందన్నారు. ఆక్సిజన్ కొరత రానివ్వకుండా ఉన్న దానిని దుర్వినియోగం చేయకుండా సక్రమంగా వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు.   అనంతరం జిజిహెచ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఆవరణంలో ఏర్పాటు చేయనున్న 10 కేల్  సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటును కలెక్టర్, జెసి పరిశీలించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.పి వెంకట బుద్ధ, ఆర్ఎమ్ఓ డా.ఈ గిరిధర్, జిజిహెచ్ నోడల్ అధికారి ఎమ్ .భాను ప్రకాష్ , ఇతర వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు