ఆక్సిజన్ మోతాదు పూర్తిస్థాయిలో ఉండాలి..


Ens Balu
2
Tirupati
2021-05-08 11:41:32

వైద్య అధికారులు సూచనల మేరకు ఆక్సిజన్ కూడా మెడిసిన్ లాంటిది, ఎక్కువ ఇచ్చినా , తక్కువ ఇఛ్చినా మంచిది కాదు ప్రతి 2 గంటలకు బెడ్లు వద్దకు వెళ్లి డాక్టర్లు  మానిటర్ చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.హరిణారాయణన్ అన్నారు. శనివారం మధ్యాహ్నం స్థానిక ఆర్.డి.ఓ. కార్యాలయంలో ఆక్సిజన్ వినియోగం, టాంకర్ల రాక పై నోడల్ అధికారులతో, డాక్టర్ల తో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.  కలెక్టర్ మాట్లాడుతూ స్విమ్స్,రుయా ఆక్సిజన్ వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టి వేస్టేజ్ నివారణ పై ఒక రిపోర్ట్ తయారు చేయాలని, అదే పద్దతి మేరకు ప్రవేట్ లో వినియోగం జరగాలని అన్నారు. ప్రధానంగా పేషెంట్ బాత్ రూమ్ వెళ్ళినపుడు, పుడ్ తీసుకునేటప్పుడు ఆక్సీజన్  వాడకం ఆపాలి అన్నారు. పేషెంట్ కు ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి, ఎక్కువైనా ప్రమాదం, తక్కువ అయినా ప్రమాదం అన్నారు. ఐసీయూలో వాడకం, స్టెబిలిటీ వున్న పేషేంట్ల ఆక్సిజన్ బెడ్లకు సిఫ్ట్ వంటివి జరగాలి అన్నారు. ప్రవేట్ ఆసుపత్రులు వాడకం ఆక్సిజన్ బెడ్ల ప్రకారం ఎంత కె.ఎల్.వాడారనే రిపోర్ట్ ప్రతి రోజు రావాలి అన్నారు. డిస్ట్రిబ్యూటర్, డీలర్స్ అమ్ముతున్న వివరాలు ఉండాలి అన్నారు. స్విమ్స్ కొత్త ట్యాన్క్ రెండు రోజుల్లో ఇంస్టాల్ కావాలని సూచించారు. రుయా, మెటర్నటీ కలిపి 25 కె.ఎల్. కెపాసిటీ వుంది, 12 కె.ఎల్. వరకు వాడకం వుంది, ఆక్సిజన్ లేదనే సమస్య తలెత్త రాదు అన్నారు. ఎప్పటికప్పుడు టాంకర్ల ట్రాకింగ్ ఉండాలి, ఆలస్యంగా లేకుండా లారీలు వచ్ఛే విధంగా చూడాలని అన్నారు. ప్రవేట్ ఆసుపత్రులు ప్రతి రోజు  ఆక్సిజన్ ఆడిట్ రిపోర్ట్ ఉండాలి అన్నారు. 

ఈసమీక్ష లో  జెసి( డి)వీరబ్రహ్మం, సబ్ కలెక్టర్ మదనపల్లి జాహ్నవి, అసిస్టెంట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జెసి ( సంక్షేమం) రాజా శేఖర్, ఆర్డీవో కనకనరసా రెడ్డి, జి.ఎం., డిఐసి ప్రతాప్ రెడ్డి, ఆరోగ్యశ్రీ కో ఆర్డినెటర్ డా. బాలాంజనేయులు, రుయా సూపరినెంట్ డా.భారతి, ప్రొఫెసర్ రోజారామణి, స్విమ్స్ ప్రొఫెసర్ డా.ఆలోక్ సమంత్ రో  ,  జి.ఎం. ప్రసన్న లక్ష్మీ, డ్రగ్ ఇన్సెపెక్టర్ కీర్తన, అధికారులు ఉన్నారు.

సిఫార్సు