విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం అభివృద్ధికి ఎవరి స్థాయిలో వారు విశేష సేవలు అందించాలని రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రభుత్వం వారంతా ప్రభుత్వ అతిథిగృహంలో విజయ్ సాయిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్బంగా వీరంతా ఆయనను ఘనంగా సత్కరించారు. తమ సేవలను గుర్తించి కీలకమైన ప్రత్యేక ఆహ్వానితులు పదవులు అప్పగించినందుకు వీరంతా విజయసాయిరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ్యులు మాట్లాడుతూ, మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేవస్థానం అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. భక్తులకు మరింతగా మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ ప్రత్యేక ఆహ్వానితులు
గంట్ల శ్రీనుబాబు, యండమూరి విజయ, దశ మంతుల మాణిక్యాలరావు, ఎస్ ఎన్ రత్నం తో పాటు, అర్బన్ పార్టీ అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్, కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మహాదేవ్ ఆనంద్ రావు, పార్టీ నాయకులు, గొల గాని శ్రీనివాస్ తదితరులు పాల్గున్నారు.