డాక్టర్ పురుషోత్తం మ్రుతి తీరని లోటు..మంత్రి అవంతి


Ens Balu
3
Visakhapatnam
2020-08-27 15:58:10

విశాఖ నగరంలోని  దస్పల్లా హిల్స్ లో డాక్టర్ పురుషోత్తం కుటుంబ సభ్యులను  పర్యాటక శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు , ఏఎంసి ప్రిన్సిపాల్,  కేజీహెచ్ పర్యవేక్షక అధికారి డా..సుధాకర్ పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ, డా..పురుషోత్తం మృతి చాలా బాధాకరమని, ఆయన సమాజానికి ఎంతో సేవచేశారన్నారు. కరోనా వారియర్ గా సేవలందిస్తూ మృతి చెందడం అందరినీ కలచివేసిందన్నారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. కోవిధ్ సమయంలో వైద్యులు దేవుళ్ళుతో సమానమని, కరోనా సేవలు అందిస్తున్న వైద్యులకు ఎంత సహాయం చేసిన తక్కువే నన్నారు. డాక్టర్ పురుషోత్తం కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ. 50 లక్షలు సహాయం అందించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని మంత్రి తెలిపారు. కోవిడ్ సేవలు అందిస్తున్న వైద్యులకు పూర్తి స్థాయిలో భద్రత భరోసా ఇవ్వాలని సీఎం ఆదేశించారని ఆ మేరకు పురుషోత్తం కుటుంబానికి రూ.50 లక్షల సహాయాన్ని కూడా అందిస్తారని మంత్రి వెల్లడించారు.
సిఫార్సు