ప్రాధాన్యతా క్రమంలో వేక్సిన్ వేయాలి..
Ens Balu
2
Visakhapatnam
2021-05-08 12:46:38
మహావిశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని అర్భన్ పీహెచ్సీల్లో ప్రాధాన్యతా క్రమంలో ప్రజలకు కోవిడ్ వేక్సిన్ వేయాలని మేయర్ గొలగాని హరివెంకట కుమారి వైద్యాధికారులను ఆదేశించారు. జివిఎంసి పరిధిలోని మూడవ జోనులో 16వ వార్డులోగల మద్దిలపాలెం మాక్స్ సెంటర్లో వ్యాక్సినేషన్ సెంటర్ నుంచి ప్రజల వద్ద నండి ఫిర్యాదు రావడంతో ఆ సెంటర్ ను మేయర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెంటర్లో వ్యాక్సినేషన్ జరిగే ప్రక్రియ, రికార్డులను పరిశీలించారు. డా. జీవన్ రాణి తో మాట్లాడుతూ, వ్యాక్సినేషన్ కొరకు వచ్చిన వారందరికి వ్యాక్సిన్ ఇవ్వాలని డాక్టరుకు సూచించారు. ఈ సెంటరుకు 300 డోసులు వచ్చాయని, రెండవ డోస్ కొరకు వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని డాక్టరు, మేయర్ కు తెలియజేసారు. అనంతరం, మేయర్ ప్రజలతో మాట్లాడుతూ, అందరూ వరుసక్రమంలో ఉంటూ భౌతిక దూరం పాటించి వ్యాక్సినేషన్ వేయించుకోవాలని, మాస్కులు ధరించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, రద్దీ ప్రదేశాలలో తిరగవద్దని ప్రజలకు సూచించారు. వ్యాక్సినేషన్ సెంటర్ల చుట్టుప్రక్కల శానిటేషన్ చేయించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేటట్లు చూడాలని, వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యము కలగకుండా చూడాలని ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రిని ఆదేశించారు. ఇలాంటి కష్ట సమయంలో, అందరికీ వ్యాక్సినేషన్ అందజేస్తున్న వైద్య సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో 16వ వార్డు కార్పొరేటర్ మొల్లి లక్ష్మి, 15వ వార్డు కార్పొరేటర్ ఎ. శ్రీవిద్య, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, డా. జీవన్ రాణి, వై.ఎస్.ఆర్. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అప్పారావు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.