విమ్స్ డైరెక్టర్ గా డా.కె.రాంబాబు..


Ens Balu
2
VIMS Hospital
2021-05-08 13:53:35

విశాఖలోని విమ్స్ డైరెక్టర్ గా డా.కె.రాంబాబు శనివారం నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి అందిస్తున్న ఎనలేని సేవలను ప్రజలకు పూర్తిస్థాయిలో విమ్స్ ద్వారా తీసుకెళ్లేందుకు క్రుషి చేస్తానని చెప్పారు. అనంతరం విమ్స్ మినిస్టీరియల్ సిబ్బంది, వైద్యులు,  నూతన డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పరిచియం చేసుకున్నారు.  గతంలో ఇక్కడ డైరెక్టర్ గా పనిచేసిన డా.కె.సత్యవరప్రసాద్ రిలీవ్ అయ్యారు. కరోనా సెకెండ్ వేవ్ ను సమర్ధవంతంగా పనిచేసేందుకు అంతా సమిష్టిగా క్రుషిచేయాలని వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని కోరినట్టు ఆయన చెప్పారు. ఎలాంటి సమస్యలున్నా నేరుగా తన వద్దకు తీసుకురావాలని డైరెక్టర్ రాంబాబు కోరారు..
సిఫార్సు