విశాఖలోని సింహాచలం శ్రీనివాసనగర్ శ్రీ బంగారుతల్లి వృద్ధాశ్రమంలో మాతృదినోత్సం సందర్భంగా అదివారం అనాధ తల్లులకు కరోనా వైరస్ నియంత్రణ కిట్లును సామాజిక వేత్త విజినిగిరి.బాలభానుమూర్తి కె.వి.సంతోష్ కుమార్ తో కలసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,అందరూ అన్ని వర్గాల వారికి ఈ కరోనా సమయంలో సహాయం చేస్తున్నంటే అనాధాశ్రమంలో జీవనం గడిపే వారికి తమవంతు సహకారం అందించాలని సంకల్పించి ఈ చిన్న కార్యక్రమం చేపట్టనట్టు చెప్పారు. కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న 23 మందికి మాస్కులు, మందుల కిట్లు పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన కరోనా నిబంధనలు పాటిస్తూ వీటిని అందించామన్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ఈ కిట్ లోని మందులు వినియోగించాలని వారికి సూచించామని చెప్పారు.