ఓటరు సవరణ ప్రక్రియ పక్కాగా జరగాలి..జిల్లా కలెక్టర్


Ens Balu
3
Visakhapatnam
2020-08-27 16:31:38

విశాఖపట్నం జిల్లాలో ఓటర్ల  జాబితా ప్రత్యేక సవరణ 2021 కార్యక్రమం పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. గురువారం ఈ మేరకు డివిజను అధికారులు, తహశీల్దార్లు, ఇ.ఆర్.ఒ., ఎ.ఇ.ఆర్.ఒ. లతో జిల్లా కలెక్టరు వి. వినయ్ చంద్  వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ, 2021 సంవత్సరానికి ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా సవరణ షెడ్యూలు ప్రకారం ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. జనవరి 2021 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తయిన వారు, ఓటర్ల జాబితాలో పేరు లేనివారి నమోదు,  మరణించిన వారి పేర్లు తొలగింపు, కార్యక్రమం చేపట్టాలన్నారు.  ఓటరు ఫోటో క్లియర్ గా ఉన్నది లేనిది పరిశీలించాలన్నారు.  ఒకే పేరుతో ఎక్కువ కార్డులు ఉంటే మొదట జారీ చేసిన కార్డు ఉంచి మిగిలిన కార్డులు తొలగించాలన్నారు.  అదే విధంగా ఒకే నంబరుతో వేరువేరు వ్యక్తులకు కార్డులు జారీ అయితే మొదట జారీ చేసిన వ్యక్తికి ఉంచి మిగిలిన వారికి కొత్త కార్డులు జారీ చేయాలని తెలిపారు.  పోలింగు బూతుకు 1500  ఓటర్ల ప్రకారం సర్దుబాటు చేయాలన్నారు.    అవసరమైన చోట కొత్త పోలింగు కేంద్రాలు గుర్తించాలన్నారు.  పాడయిన పోలింగు కేంద్రాల స్థానంలో కొత్త పోలింగు కేంద్రాలు ఏర్పాటుకు నిబంధనల ప్రకారం నడచుకోవాలన్నారు.  కొత్త పోలింగు కేంద్రాల ఏర్పాటుకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలన్నారు.  ఓటర్ల  జాబితాలో  పేర్లు నమోదు, అభ్యంతరాలు,  మార్పులకు సంబంధించి డిశంబరు 15 వరకు వివిధ దశలలో జనవరి 5, 2021 వరకు  పరిష్కరించి, జనవరి 15, 2021 నాటికి తుది ఓటర్ల జాబితా ప్రచురణకు సిద్దం చేయాలని తెలిపారు. 
సిఫార్సు