ప్రతీ రోజు ఆసుపత్రులకు వెళ్లి ఖాళీ పడకలు, ఆక్సిజన్ అవసరం తెలుసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరాల పై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రుల వారీగా ఎన్ని ఆక్సిజన్ పడకలు ఉన్నవి, పడకల సంఖ్య, ఎంత ఆక్సిజన్ అవసరం, అక్కడ ఆక్సిజన్ నిల్వ కు అవకాశం ఉన్నదా లేదా అనే వివరాలను తెలుసుకొని తెలియజేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్, సర్వే శాఖ సహాయ సంచాలకులు మనీషా త్రిపాటి, ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్ రాజేష్ లను ఆదేశించారు. ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరాలను ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ రామలింగరాజు చూసుకోవాలన్నారు. ఏ ఆసుపత్రికి చేరాల్సిన ఆక్సిజన్ ఆ ఆసుపత్రులకు చేరాలని చెప్పారు. ఆయా వాహనాల జిపిఎస్ ను ఐ. టి. వారు చూసుకుంటారని తెలిపారు. ఆక్సిజన్ సరఫరాకు మేనేజ్ మెంట్ కు ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని కలెక్టరేట్ ఎఓకు ఆదేశించారు. ఆయా ఆసుపత్రులకు ఆక్సిజన్ అవసరాన్ని గుర్తించి సంబంధిత నోడల్ అధికారులు తెలియజేస్తారని చెప్పారు. 24*7 గంటలు ఈ కాల్ సెంటర్ పనిచేస్తుందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ రామలింగరాజు, ఆర్డీఓ పెంచల కిషోర్, డిఆర్డిఎ పిడి వి. విశ్వేశ్వరరావు, డిటిసి రాజరత్నం, సర్వే శాఖ సహాయ సంచాలకులు మనీషా త్రిపాఠి, డ్రగ్ కంట్రోల్ సహాయ సంచాలకులు లావణ్య, తదితరులు పాల్గొన్నారు.