సమాచారశాఖ ఏడీగా తన్నీర్ మోహన్..


Ens Balu
1
Ongole
2021-05-10 14:29:34

ప్రకాశం జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులుగా  తన్నీరు మోహన్ రాజు  నియమితులయ్యారు.  ఆమేరకు సంబంధిత శాఖ రాష్ట్ర కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి  సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.  ప్రస్తుతం సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న కె.మల్లేశ్వర్ సెలవుపై వెళ్తున్న నేపథ్యంలో మార్కాపురం డివిజనల్ పీఆర్ఓ గా విధులు నిర్వహిస్తున్న మోహన్ రాజు కు సహాయ సంచాలకులుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తక్షణమే మల్లీశ్వర్  నుంచి ఛార్జి తీసుకున్నారు. సహాయ సంచాలకులుగా మోహన్ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది ఆయనను మర్యాద పూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు.
సిఫార్సు