అనంతపురం జిల్లా హిందూపురం జిల్లా ఆసుపత్రి ఇంచార్జ్ మెడికల్ సూపరింటెండెంట్ గా డా.జాన్లీ జోసెఫ్ ను నియమిస్తూ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇంఛార్జ్ గా వ్యవహరిస్తున్న డిప్యూటీ సివిల్ సర్జన్ డా.దివాకర్ వెంటనే జాన్లీ జోసెఫ్ కు ఇంచార్జ్ సూపరింటెండెంటుగా బాధ్యతలు అప్పగించాలని కలెక్టర్ ఆదేశించారు. కోవిడ్ సమయంలో ఆసుపత్రి నిర్వహణను మెరుగుపరిచేందుకు నూతన ఇంచార్జ్ సూపరింటెండెంట్ ను నియమించామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. డా.జాన్లీ జోసెఫ్ హిందూపురం జిల్లా ఆసుపత్రిలో హిందూపురం జిల్లా ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (అనస్థీషియా) పని చేస్తున్నారు. డా.జాన్లీ జోసెఫ్ కు బాధ్యతలు అప్పగించిన అనంతరం డా.దివాకర్ తిరిగి రోళ్ల మండలం కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ కు డిప్యూటీ సివిల్ సర్జన్ గా విధులు నిర్వర్తించాల్సిందిగా ఉత్తర్వుల్లో ఆదేశించారు..