పదిరోజుల్లో నిర్మాణాలు పూర్తికావాలి..కమిషనర్ గిరీష


Ens Balu
5
Tirupati
2020-08-27 16:50:19

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ఎమ్.ఆర్ పల్లి వైకుంఠపురం ఆర్చి వద్ద శాశ్వత కొత్త కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులు పది రోజుల్లో పూర్తి చేయాలని కమిషనర్ గిరీష ఆదేశించారు.  గురువారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి, జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జరుగుతున్న పనుల్లో ఎక్కడ తేడా వచ్చినా అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ కోవిడ్ 19( కరోనా వైరస్ వ్యాధిని అరికట్టడం కోసం ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ ని తాత్కాలికంగా ముయించామన్నారు. నగర ప్రజలకి ఆయా వార్డుల్లో అందుబాటులో కోసం తాత్కాలికంగా 9 ప్రదేశాల్లో తాత్కాలిక కూరగాయలు మార్కెట్ ఏర్పాటుచేశామని వివరించారు. ఎంఆర్ పల్లి వాసుల కోసం కొత్తగా వైకుంఠపురం ఆర్చి వద్ద సుమారు 20 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న ఈ మార్కెట్ లో 36 షాపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.  ఎస్ఈ  చంద్రశేఖర్, నగరపాలక అధికారులు పాల్గొన్నారు.
సిఫార్సు