ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా కిట్లు..


Ens Balu
1
Visakhapatnam
2021-05-10 15:13:40

మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి కరోనా సమయంలో ప్రజలకు సేవలు అందిస్తున్నారని జివిఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. సోమవారం నాలుగవ జోనులోని 28వ వార్డు ఫ్రంట్ లైను వ్యారియర్సుకు కరోనా కిట్లు పంపిణీ చేశారు. కెనరా బ్యాంకు ఎంప్లాయిస్ యూనియన్(సి.బి.ఇ.యు.) 71వ వ్యవస్థాపక దినోత్సవం, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సమైఖ్య ఆధ్వర్యంలో 25వ వార్షికోత్సవం సందర్భంగా ఫేస్ షీల్డ్ మాస్కులు, మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్సు, వితరణ చేసారు. సుమారు 70మంది ఫ్రంట్ లైను వ్యారియర్సుకు మేయర్  వీటిని అందించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, కరోనా రెండవ దశ చాలా ఉధృతంగా ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు చాలా జాగ్రత్తలు పాటించాలని అవసరమైతేనే బయటకు రావాలని, రద్దీ ప్రదేశాలలో తిరగరాదనీ, నిత్యం మాస్కులు ధరించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంకు ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం. శ్రీనివాస కుమార్, ఆడారి శ్రీనివాసరావు, 28వ వార్డు కార్పొరేటర్ పల్లా అప్పలకొండ, 28వ వార్డు ఇంచార్జ్ పల్లా దుర్గా రావు తదితరులు పాల్గొన్నారు.    
సిఫార్సు