చందనోత్సవానికి వడి వడిగా చందనం అరదీత..


Ens Balu
1
Simhachalam
2021-05-10 15:30:08

విశాఖలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి చందనోత్సవానికి చందనం అరగదీత కార్యక్రమం వడి వడిగా సాగుతోంది. సోమవారం ఈ మేరకు 27 కిలోల చందనాన్ని అరగదీశారు. ప్రతీరోజూ అరగదీసే చందనాన్ని స్వామివారి బాంఢాగారంలో అర్చకులు ఎంతో భక్తి శ్రద్ధలతో భద్ర పరుస్తున్నారు. ఈనెల 14న వైశాఖ శుద్ధ తదియను పురస్కరించుకుని జరిగే చందనోత్సవం రోజు స్వామివారికి తొలివిడతగా చందనాన్ని సమర్పించనున్నారు. దీనికోసం నిత్యం చందనాన్ని సుగంధ పరిమలాలను సిద్దం చేస్తున్నారు. భక్తులు సమర్పించే చందనాన్ని కూడా వారిపేరుతో ఆరోజు గోత్రనామలతో పూజలు చేస్తారు.