స్మార్ట్ సిటీ లో భాగంగా నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ హరి నారాయణ గారు అన్నారు. సోమవారం సాయంత్రం తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ 22 బోర్డు మీటింగ్ స్మార్ట్ సిటీ ఎం.డి. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష అధ్యక్షతన నగరపాలక వై.ఎస్. ఆర్ సమావేశ మందిరం నందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ హరి నారాయణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభివృద్ధి పనులకు ఆమోదముద్ర వేశారు. ముఖ్యంగా ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కొరకు గార్బేజ్ కలెక్షన్ కోసం రెండు కోట్ల రూపాయలతో కొత్త బండ్లు కు ఆమోదం తెలిపారు. నగరంలో పలు చెరువులు, గొల్లవాని గుంట, కొరమేను గుంట, పూల వానిగుంట చెరువులు సుందరీకరణ కొరకు ఎనిమిది కోట్ల రూపాయలు పనులు చేయుటకు పరిపాలన ఆమోదం ఇవ్వడం జరిగింది. వినాయక సాగర్ వద్ద మల్టీపర్పస్ ఆల్, మ్యూజికల్ ఫౌంటెన్ మరియు వాటర్ స్క్రీన్, సెంట్రల్ ఐలాండ్ మొదలగు అభివృద్ధి పనులకు ఆమోదం ఇవ్వడం మరియు మంగళం, తుకివాకం మరియు వినాయక సాగర్ సరస్సు వద్ద సోలార్ ప్లాంట్ కు ఆమోద ముద్ర వేశారు. చైర్మన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్న పనులు శరవేగంగా పూర్తి చేయాలని, పనులు ఎక్కడ ఆలస్యం జరగకుండా త్వరగా పూర్తిచేయాలని అన్నారు.
ఈ స్మార్ట్ సిటీ బోర్డు మీటింగ్ లో వీడియో కాన్ఫరెన్స్ లో స్మార్ట్ సిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ హరి నారాయణ, తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో స్మార్ట్ సిటీ ఎం. డి, నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష, స్మార్ట్ సిటీ జి.ఎం చంద్రమౌళి, ఎస్.ఈ మోహన్, యం.ఈ. చంద్రశేఖర్, డి.ఈ. కరుణాకర్ రెడ్డి,ఎయికాం బాలాజీ పాల్గొన్నారు. నగరంలో వారి వారి కార్యాలయం నుండి తిరుపతి అర్బన్ ఎస్పి వెంకటప్ప నాయుడు, తిరుమల తిరుపతి జేఈఓ సదా భార్గవి, బోర్డు మెంబర్లు రామచంద్రారెడ్డి, రమ్య శ్రీ, న్యూఢిల్లీ నుండి విశాల్ తదితరులు పాల్గొన్నారు.