జర్నలిస్టులూ మీ ఆరోగ్యాలు జరభద్రం..


Ens Balu
1
Visakhapatnam
2021-05-11 03:35:02

ఆంధ్రప్రదేశ్ తోపాటు తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులంతా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, కరోనా వైరస్ సోకకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ(ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net) సంపాదకులు, అల్లూరి చరిత్ర పరిశోధకులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) కోరారు. మంగళవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. సెకెండ్ వేవ్ కరోనాలో అత్యధికంగా జర్నలిస్టులు కరోనాకు బలవడం మనసుని ఎంతగానో కలచివేస్తుందన్నారు. ఇలాంటి సమయంలో మన రక్షణ మనమే తీసుకోవాలన్నారు. ప్రతీ జర్నలిస్టు విధినిర్వహణలో బయటకు వెళ్లాల్సి వస్తే డబుల్ లేయర్ వున్న మాస్కులు ధరించడంతోపాటు, చేతులకు హేండ్ గ్లౌజులు వేసుకొని బౌతిక దూరం పాటించాలన్నారు. ఎప్పుడు ఎక్కడ ఏది పట్టుకున్నా శానిటైజర్లు వినియోగించాలన్నారు. జర్నలిస్టులపైనే వారి కుటుంబాలు ఆధారపడి ఉన్నాయనే విషయాన్ని ప్రతీ జర్నలిస్టూ గుర్తించాలన్నారు. జర్నలిస్టులను కేంద్రం ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించకపోవడం శోచనీయమన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెలింగి బాహ్య ప్రపంచంలో జరుగుతున్న సమాచారాన్ని ప్రజలకు, ప్రభుత్వాలకు సమయానికి అందిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు జర్నలిస్టులను గుర్తించకపోవడం దారుణమన్నారు. జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ కరోనా టీకాలు వేయాలన్నారు. వారి కుటుంబ సభ్యులకు కూడా టీకా వేసే కార్యక్రమం ప్రభుత్వం వెంటనే చేపట్టాలన్నారు. హెల్త్ ఇన్స్యూరెన్సులు చేయడంతోపాటు, ఆరోగ్యశ్రీ కార్డులు, అక్రిడిటేషన్లు తక్షణమే మంజూరు చేయాలన్నారు. ఇప్పటి వరకూ కరోనాతో మ్రుతిచెందిన జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని తక్షణమే జర్నలిస్టుల కుటుంబాలకు అందిచాలని,  జర్నలిస్టుల బతుకులకు రాష్ట్రప్రభుత్వం భరోసా కల్పించాలని ఈఎన్ఎస్ బాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సిఫార్సు