ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ప్రజలకు చేరాలి..


Ens Balu
1
Ongole
2021-05-11 12:42:41

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు, పరిపాలన, సేవలను సమాచారశాఖ మీడియా ద్వారా ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ ఏడి తన్నీమోహన్ కు సూచించారు. మంగళవారం కొత్తగా విధుల్లోకి చేరిన ఏడీ జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,  ప్రభుత్వానికి మంచి పెరు తెచ్చేలా సమాచారశాఖ సేవలు అందించాలని సూచించారు. మీడియాకు అందుబాటులో ఉండి  తాజా సమాచారాన్ని అందజేయాలన్నారు. ప్రభుత్వం ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా దానిని మీడియా ద్వారా ప్రజలకు చేరవేయడంలో ముందుండాలన్నారు. ఎలాంటి సమస్యలున్నా తక్షణమే తన ద్రుష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఏపీఆర్ ఓ డి.దుర్గాప్రసాద్, ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు