కరోనా బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందేలా అధికారులు మానవతా దృక్పధంతో వ్యవహరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయనపునరుద్ఝాటించారు. కరోనా నివారణ, పలు అభివృద్థి కార్యక్రమాలపై మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క రోనా అనుమానితులకు, బాధితులకు ఏ విధ మైన సహాయం కావాలన్నా తక్షణమే స్పందించేలా ఏర్పాటుచేసిన 104 కాల్‌సెంటర్ నిర్వహణ పై కలెక్టర్, సంబంధి త సంయుక్త కలెక్టర్ ప్రత్యేక శ్రద్థ పెట్టాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సూచించారు. వైద్య సేవలు అవసరమైన వారికి మూడు గ ంటల్లోనే అవి అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆపదలో వుండి 104 కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసిన వారిని తమ కుటుం బ
సభ్యులుగా భావించి వారికి అవసరవై ున వైద్యసేవలు అందేలా అధికారులు తక్షణమే స్పందించాలని సి.ఎమ్. స్పష్టం చేశారు. కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా వైద్యసేవలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నందున ఆయా ఆసుపత్రుల్లో పారిశుద్థ్య నిర్వహణ, ఔషధాల లభ్యత, తగిన సంఖ్యలో వై ద్య సిబ్బంది , ఆరోగ్యశ్రీ కార్యకర్త ఉండేలా అధికారులు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి దిశానిర్థేశం చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ పేషంట్లకు ఆయా యాజమాన్యాలు ఖచ్చితంగా కేటాయించేలా చూడాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆసుపత్రుల్లో అవస రమైన వైద్య సిబ్బందిని తక్షణమే భర్తీ చేసుకోవాలని సి.ఎమ్. ఆదేశించారు. క రోనా బాధితులకు అవసరమైన ఆక్సిజన్‌ను సమకూర్చుకోవడంలో ప్రణాళికాబద్ధ ంగా వ్యవహరించాలని అన్నారు. ఆక్సిజన్ వి నియోగక్ర మంలో వృధాను అరికట్టాలని చెప్పారు. కోవిడ్ కేర్ సెంటర్లకు కూడా అవసరాన్ని బట్టి ఆక్సిజన్ అందుబాటులో వుంచాలన్నారు. రాష్ట్రంలో క రోనా మరణాలు అత్యల్ప స్థాయిలో
వుండటానికి కలెక్టర్లు, వైద్యుల నుంచి క్షేత్రస్థాయిలో వాలంటీర్లు, ఏ.ఎన్.ఎమ్.లు, ఆశావర్కర్లు చిత్తశుద్థితో పనిచె యడమే కారణమని అభినందించారు.
కరోనా కట్టడికి కర్ఫ్యూ ఆంక్షలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు
అభివృద్థి కార్యక్రమాలను కూడా ప్రాధాన్యం ఇచ్చి చేపట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. పేదలకు ఇటీవల ఇచ్చిన ఇళ్ల స్థలాలలో జూన్ నుంచి ఇళ్లు నిర్మించుకునేందుకు అవసరమైన ఇసుక, సిమెంటు, స్టీలు అందుబాటులో వుండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు అవసర మైన ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ఉపాధిహామి పథకంలో 20 కోట్ల పనిదినాలు ఈ ఆర్థిక సంవత్సరంలో కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నందున వాటిలో 80 శాతం మే, జూన్ నెలల్లోనే పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఖరీఫ్ వ్యవసాయ పనులు ముమ్మరం కావటానికి ముందే ఉపాధి హామి పనులను పెద్దఎత్తున చేపట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను గడువులోగా పరిష్కరించాలని, ఈ విషయం పై ప్రకాశం జిల్లా అధికారులు మరింత దృష్టి
సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పోల భాస్కర్, జాయింట్ కలెక్టర్లు జె.వి. మురళి (ఆర్.బి. అండ్. ఆర్.), టి.ఎస్. చేతన్ (సచివాలయాలు, అభివృద్థి), క్రిష్ణవేణి (ఆసరా, సంక్షేమం), కంద ుకూరు సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ, మార్కాపురం, ఒంగోలు ఆర్.డి.ఓ.లు శేషిరెడ్డి, ప్రభాకర రెడ్డి , వ్యవసాయ శాఖ జె.డి. శ్రీరామమూర్తి, డి.పి.ఓ. నారాయణ రెడ్డి, డ్వామా పి.డి. శీనారెడ్డి, ఆర్.డబ్ల్యు.ఎస్. ఎస్.ఇ. వ ుర్థన్ అలి, పంచాయతి రాజ్ ఎస్.ఇ. కొండయ్య, డి.ఎమ్.హెచ్.ఓ. డాక్టర్
రత్నావళి, డి.సి.హెచ్.ఎస్. డాక్టర్ ఉషారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.