మరింతగా సేవలు అందించాలి..


Ens Balu
2
కలెక్టరేట్
2021-05-11 13:08:20

కోవిడ్ మహమ్మారి కారణంగా ఉత్పన్నమైన విపత్కర పరిస్థితులలో మరింతగా మానవతా దృక్పథంతో పనిచేసి రోగులకు సేవలందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను కోరారు. మంగళవారం  తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోవిడ్-19, ఉపాధి హామీ పథకం, హౌసింగ్, స్పందన గ్రీవెన్స్ లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లు, యంత్రాంగం కోవిడ్ నియంత్రణ నిమిత్తం సమర్థవంతంగా పనిచేసారని ప్రశంసించారు. 
104 కాల్ సెంటర్ల పనితీరు మరింతగా మెరుగు పరచాలని, కాల్ చేసిన వ్యక్తికి ఖచ్చితమైన సమాచారాన్ని అందించి, సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.  జిల్లా స్థాయి ఆక్సిజన్ సెల్ లు సమన్వయంతో పనిచేసి ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత రాకుండా చూడాలని అన్నారు. విశాఖపట్నం నుంచి జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి, రూరల్ ఎస్పీ బి.కృష్ణా రావు, అసిస్టెంట్ కలెక్టర్ అదితి సింగ్, ఎఏంసి ప్రిన్సిపాల్ డా. పి వి సుధాకర్, డిఎంహెచ్ఓ డా.సూర్య నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. 
సిఫార్సు