కళింగ కోవిడ్ కేర్ కేంద్రంలో 60 బెడ్లు..


Ens Balu
1
ఐఎన్ఎస్ కళింగ
2021-05-11 13:14:49

కోవిడ్ రెండవ దశ ఉద్ధృతం ఉన్న సమయంలో ఐఎన్ఎస్ కళింగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి  శ్రీనివాసరావు కోరారు. మంగళవారం కళింగలో కోవిడ్ కేర్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. భీమిలి నియోజకవర్గంలో కోవిడ్  బాధితులను ఆదుకోవడం కోసం భీమిలి ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ల పర్యవేక్షణలో 60  బెడ్లతో పాటు 16 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశామన్నారు.  అవసరమైన అన్ని సదుపాయాలతో ఈ కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసిన ఐఎన్ఎస్ కళింగ నేవి సిబ్బందికి  మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు అందరూ స్వచ్ఛందంగా కరోనా నియంత్రణకు సహకరించాలన్నారు. ఎవరూ బయటకి రాకుండా  శానిటైజేషన్  మరియు నిత్యం మాస్కులు ధరించి కోవిడ్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎన్ఎస్ కళింగ చీఫ్ కమాండర్ కమడోర్ నీరజ్ ఉదయ్, డిఎంహెచ్ఓ సూర్యనారాయణ, 4వార్డు కార్పొరేటర్ దౌలపల్లి కొండబాబు, భీమిలి హెల్త్ ఆఫీసర్ సిద్దార్థ్, వైద్యాధికారులు, నేవీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు