నా పుట్టిన రోజుకి ఎవరూ రావొద్దు దయచేసి..
Ens Balu
3
Rajahmundry
2021-05-11 13:55:08
తన పుట్టినరోజు సందర్భంగా బుధవారం శుభాకాంక్షలు స్వయంగా చెప్పడానికి ఎవరూ రావొద్దని ఎంపీ, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ విజ్ఞప్తి చేశారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి అధికంగా వున్నందున తనకు శుభాకాంక్షలు వాట్సాప్, ఫేస్ బుక్ ద్వారా తెలియజెస్తే సరిపోతుందని సూచించారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉదృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నానని, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వేడుకలు చేసుకోవడం భావ్యం కాదన్నారు. మిఠాయిలకు, పూల గుత్తులు, దండల కోసం వెచ్చించే బదులు ఆ సొమ్ముతో నిరుపేదలకు మాస్క్ లు, శానిటైజర్స్, ఫేస్ సీల్డ్స్ పంపిణీ చేస్తే తాను చాలా సంతోషిస్తానని పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ తమతమ ఇళ్ళ నుంచి బయటకు రావద్దని హితవు పలికారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావలసి వస్తే తప్పనిసరిగా రెండు మాస్క్ లు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్ వినియోగిస్తూ కోవిడ్ నిబంధనలు ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాజన్న రచ్చబండ కార్యక్రమంలో కూడా ప్రజారోగ్య సమస్యలపైనే ప్రధాన దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిగత సమస్యలతో తన వద్దకు కొద్ది రోజుల పాటు రావద్దని ఎంపి భరత్ రామ్ ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.