నాడు-నేడు పనులు వేగం పెంచాలి..


Ens Balu
2
Anantapur
2021-05-11 14:03:52

నాడు - నేడు కింద చేపడుతున్న అభివృద్ధి పనులు, రైతు భరోసా కేంద్రాల భవనాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, వై.ఎస్.ఆర్ అర్బన్ క్లినిక్ లు, గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలు, పేదలందరికీ ఇల్లు కింద నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్ లతో రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్ 19, ఎన్ఆర్ఈజిఎస్ పనులు, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, డా.వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్ లు, వై.ఎస్.ఆర్ జలకళ, వై.ఎస్.ఆర్ అర్బన్ క్లినిక్ లు, నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పురోగతి,  స్పందన గ్రీవెన్స్ తదితర అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

అనంతపురం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ, తదితరులు పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ ఇంజనీరింగ్ శాఖల కింద చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలన్నారు. నాడు నేడు కింద ఆయా పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, రైతు భరోసా కేంద్రాలు భవనాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, వై.ఎస్.ఆర్ అర్బన్ క్లినిక్ లు, గ్రామ సచివాలయ భవనాల నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టాలని ఇంజనీరింగ్ శాఖల అధికారులను ఆదేశించారు.  నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు ఏర్పాటుచేసిన లేఔట్లలో నీటి సౌకర్యం, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు, పెన్షన్ కార్డు, రైస్ కార్డులను నిర్దేశిత సమయంలోపు ఖచ్చితంగా ఇచ్చేలా చూడాలని, అలాగే 90 రోజుల్లోపు దరఖాస్తు చేసుకున్న వారికి ఇళ్లను మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా సచివాలయాలకు వచ్చే గ్రీవెన్స్ కు సంబంధించి ఎలాంటి పెండింగ్ ఉంచరాదని, ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలన్నారు. కోవిడ్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్ కి వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు. అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ సీజన్లో కూలీలకు ఉపాధి పనులు ఎక్కువగా కల్పించాలని డ్వామా పిడిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి,  స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు వరప్రసాద్, రవీంద్ర, ఆనంద్, డిఎంఅండ్హెచ్ఓ కామేశ్వర ప్రసాద్, వ్యవసాయ శాఖ జెడి రామకృష్ణ, ఐసిడిఎస్ పిడి విజయలక్ష్మి, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ నీరజ, డి సి హెచ్ ఎస్ రమేష్ నాథ్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, హౌసింగ్ పిడి చంద్రమౌళి రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.