బుధవారం నుంచి కోవిడ్ వేక్సినేషన్..


Ens Balu
3
Vizianagaram
2021-05-11 14:11:26

విజయనగరం  జిల్లాలో బుధవారం నుంచి వేక్సినేషన్ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆదేశించారు. వైద్యారోగ్యశాఖ అధికారులతో మంగళవారం సాయంత్రం టెలికాన్ఫెరెన్స్ నిర్వహించి, వెక్సినేషన్ పై సమీక్ష జరిపారు. ఈ నెలాఖరు వరకు రెండో డోసు మాత్రమే వేయాలని ఆదేశించారు. వెక్సినేషన్ లో వైద్యారోగ్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వేక్సిన్ కేంద్రాలను మండలాలలో పిహెచ్సి ల నుంచి పాఠశాలలకు మార్చినందువల్ల, ఈ విషయాన్ని అందరికి తెలియజెయాలని సూచించారు. వేక్సిన్ కోసం వచ్చేవారికి కేంద్రాలవద్ద ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. లబ్ధిదారులకు ముందుగా ఏఎంఎం ల ద్వారా  సమాచారం ఇచ్చి, వారిని మాత్రమే కేంద్రాలకు రప్పించడం వల్ల, కేంద్రాలవద్ద రద్దీ తగ్గుతుందని, ప్రజలకు ఇబ్బందులు కూడా ఉండవని సూచించారు. జిల్లాలో కోవాగ్జిన్ కోసం 22 కేంద్రాలను, కోవిషీల్డ్ కోసం 42 వేక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ టెలీ కాన్ఫెరెన్సులో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ ఎస్వీ రమణ కుమారి, డిఐవో డాక్టర్ గోపాలకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సిఫార్సు