మొదటి డోస్ తీసున్నవారికే వ్యాక్సిన్..


Ens Balu
2
కాకినాడ
2021-05-11 14:25:01

ప్ర‌స్తుతం రెండో డోస్ పెండింగ్ ఉన్న‌వారికి మాత్ర‌మే టీకా పంపిణీ చేయ‌నున్నామ‌ని గ్రామ సచివాలయ జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. మంగళవారం ఆమె వర్చువల్ విధానంలో మీడియాతో మాట్లాడారు. రోజువారీ వ్యాక్సినేష‌న్‌కు సంబంధించి మీడియా ద్వారా స‌మాచారం ఇవ్వ‌నున్న‌ట్లు జేసీ  తెలిపారు. దాదాపు 67 వేల మందికి రెండో డోస్ పెండింగ్ ఉంద‌ని, ప్రాధాన్య‌త ఆధారంగా వాలంటీర్ల ద్వారా వీరికి టోకెన్లు అందించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. కోవీషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోసును 6-8 వారాల స‌మ‌యంలో వేసుకోవ‌చ్చ‌ని, ల‌బ్ధిదారులు ఈ విష‌యాన్ని గుర్తించాల‌ని సూచించారు. ప్రైవేటు ఆసుప‌త్రుల్లో తొలి డోసు వేసుకున్న‌వారికి ప్ర‌భుత్వ కేంద్రాల్లో రెండో డోసు వేయ‌నున్న‌ట్లు తెలిపారు. వ్యాక్సినేష‌న్‌పై ఏవైనా సందేహాలుంటే గ్రామ‌, వార్డు స‌చివాల‌యాన్ని సంప్ర‌దించాల‌ని సూచించారు. ఆసుప‌త్రుల సామ‌ర్థ్యం, చికిత్సా విధానాల‌కు అనుగుణంగా రెమిడెసివిర్ ఇంజెక్ష‌న్ల‌ను అందిస్తున్న‌ట్లు జేసీ తెలిపారు.
సిఫార్సు