సీసీసీల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి..
Ens Balu
1
Kakinada
2021-05-11 14:25:55
తూర్పుగోదావరి జిల్లాలోని జేఎన్‌టీయూ, బొమ్మూరు, బోడసకుర్రు కోవిడ్ కేర్ కేంద్రాల్లో ప్రస్తుతం 1369 మంది ఉన్నారని జేసీ (డబ్ల్యూ) జి.రాజకుమారి తెలిపారు. మంగళవారం వర్చువల్ విధానలో జెసి మీడియాతో మాట్లాడారు. కోవిండ్ కేర్ కేంద్రాల్లో అవసరం మేరకు వైద్య సేవలు అందించడంతో పాటు ఆహారం, పారిశుద్ధ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దురదృష్టవశాత్తు విషాదం చోటుచేసుకుంటే భౌతికకాయాన్ని తరలించేందుకు జిల్లాలో 32 మహాప్రస్థానం వాహనాలు ఉన్నాయని, వీటి సేవలు పొందేందుకు పైసా కూడా చెల్లించనవసరం లేదని స్పష్టం చేశారు. గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేశామన్నారు. ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాస్థాయి కమాండ్ కంట్రోల్‌రూంకు ఫోన్‌చేసి, ఫిర్యాదు చేయొచ్చని జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) రాజకుమారి సూచించారు.