విశాఖజిల్లాలో బుధవారం కోవిడ్ వేక్సినేషన్ రద్దు చేసినట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.పతివాడ సత్యసూర్యనారాయణ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం విశాఖలో మీడియాతో మాట్లాడారు. బుధవారం జిల్లాలో కోవిడ్ వేక్సినేషన్ రద్దు చేసిన అంశాన్ని ప్రజలు గమనించాలని అన్నారు. వేక్సినేషన్ తిరిగి ఎప్పుడు ప్రారంభించేది ప్రకటిస్తామని అంత వరకూ మొదటి టీకా వేయించుకున్నవారు బయటకు రావొద్దని డిఎంహెచ్ఓ కోరారు. వాలంటీర్లు, వైద్య సిబ్బంది, మీడియా ద్వారా వేక్సినేషన్ ప్రక్రియను తెలియజేస్తామని ఆయన వివరించారు.