మాష్టర్ ప్లాన్ కి పూర్తిస్థాయి సర్వేచేయాలి..కమిషనర్ గిరీష


Ens Balu
3
Tirupati
2020-08-27 18:22:54

కరకంబాడి రోడ్డు నుంచి  రేణిగుంట రోడ్డు కు అనుసంధానం కోసం మాస్టర్ ప్లాన్ రోడ్డు, ఇతర అంశాలను క్షేత్రస్థాయిలో తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరీష గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడుతూ,జనచైతన్య లేఔట్ నుండి డి.బి.ఆర్. రోడ్డు 60 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు మాస్టర్ ప్లాన్ నిర్మాణం విషయమై సమగ్ర సర్వే జరిపి నివేదిక సమర్పించాలన్నారు. నగరపాలక సంస్థ శివార్లలో ఉన్న కాలనీలకు, రెండు ప్రధాన రహదారులను ఏర్పాటు చేయడం వలన లీలామహల్, ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహం దగ్గర రద్దీని తగ్గించేందుకు వీలవుతుందని అన్నారు. అంతే కాకుండా ఈ మాస్టర్ ప్లాన్ కోసం కొంక చెన్నయ్య గుంట, రవీంద్ర నగర్ లకు సంబంధించిన ఫ్లాట్ యజమానులు, రైతులు సదరు సర్వే ను సంబంధిత రికార్డులతో మాస్టర్ ప్లాన్ రోడ్డు కు సహకరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వారితోపాటు సూపర్డెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిప్యూటీ అసిస్టెంట్ సిటీ ప్లానర్ దేవి కుమారి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ షణ్ముగం, మున్సిపల్ సర్వేయర్లు దేవానంద్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.