ప్లాంట్ ను నిత్యం పరిశీలించాలి..
Ens Balu
3
Visakhapatnam
2021-05-12 15:40:09
ఆక్సిజన్ ట్యాంకు నుండి ఆయా వార్డులకు సరఫరా అవుతున్న ఆక్సిజన్ ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని కోవిడ్ ప్రత్యేక అధికారి జి. సాయి ప్రసాద్ కెజిహెచ్ సూపరింటెండెంట్ ను ఆదేశించారు. కెజిహెచ్ లో ఉన్న ఆక్సిజన్ ట్యాంకును జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి తో కలసి ఆయన బుధవారం పరిశీలించారు. ట్యాంకు నుండి ఆయా వార్డులకు సరఫరా అవుతున్నపుడు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఆక్సిజన్ అయిపోతున్న సమయానికి అందుబాటులో ఉన్న మరో నిల్వ ట్యాంకుకు అనుసంధానించాలని తెలిపారు. ఎప్పటికప్పుడు దానిని తిరిగి ఆక్సిజన్ తో నింపాలని చెప్పారు. పేషెంట్లకు ఆక్సిజన్ ఆగిపోకుండా నిరంతరం సరఫరా చేయాలన్నారు. ఈ పరిశీలనలో కెజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మైథిలి, ఆర్. ఎం. ఓ. అంజిబాబు, తదితరులు పాల్గొన్నారు.