చోలపాదం నీటి సమస్యకు పరిష్కారం..
Ens Balu
3
చోలపాదం
2021-05-12 15:46:28
విజయనగరం జిల్లా కొమరాడ మండలం చోలపాదం గ్రామంలో తలెత్తిన తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు జిల్లా గ్రామీణ నీటిపారుదల శాఖ ఎస్.ఈ. రవికుమార్ బుధవారం తెలిపారు. గ్రామానికి నీటి సరఫరా చేసే పంపుసెట్‌కు మరమ్మతులు చేపట్టామని, వనధార గ్రామ పరిధిలో ఉన్న పంపుసెట్‌కు ట్రయిల్ రన్ కూడా వేయించామని చెప్పారు. ఇటీవల వివిధ పత్రికల్లో గ్రామ తాగునీటి సమస్యపై వచ్చిన వార్తలపై స్పందించి స్థానిక అధికారులను అప్రమత్తం చేసి సమస్యను త్వరితగతిన పరిష్కరించామని వివరించారు. దీనిపై చోలపాదం గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.