ఆక్సిజన్ వార్ రూమ్ ఏర్పాటు చేసి ఆక్సిజన్ నోడల్ అధికారులకు శిక్షణ ఇచ్చాము, భాద్యతతో ఆక్సిజన్ నిల్వలు ప్రతి రెండు గంటలకు తెలిపాలి, భాద్యతతో ఆక్సిజన్ కొరత వల్ల ప్రాణాలు పోకుండా కాపాడాలని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ సూచించారు. బుధవారం సాయంత్రం స్థానిక ఆర్దిఓ కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా వున్న ఆక్సిజన్ నోడల్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షకు , అర్బన్ ఎస్.పి. వెంకట అప్పలనాయుడు , జెసి హెల్త్ వీరబ్రహ్మం , సబ్ కలెక్టర్ మదనపల్లి జాహ్నవి , అర్దిఓ లు తిరుపతి కనక నరసా రెడ్డి, చిత్తూరు రేణుకా పాల్గొన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ నోడల్ అధికారులకు కేటాయించిన ప్రవేట్, ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ నోటిఫై ఆక్సిజన్ బెడ్లు, ఐసియు బెడ్ల సంఖ్య, అందుబాటులో వున్న బల్క్ సిలిండర్లు వివరాలు మీదగ్గర వుండాలి అన్నారు. ఆసుపత్రుల ఆక్సిజన్ అవసరాలు మదనపల్లి డివిజన్ లో కనీసం 9 గంటలు, తిరుపతి డివిజన్ లో 6 గంటలు, లిక్విడ్ గ్యాస్ టాంకర్ల విషయంలో 12 గంటల నిల్వలు వుండేలా చూడాలని అన్నారు. జిల్లాలో లిక్విడ్ గ్యాస్ వాడుతున్నది స్విమ్స్, రుయా, డి.హెచ్.చిత్తూరు, అమర , పి.ఇ.ఎస్. లు మాత్రమేనని అన్నారు. టాంకర్ల రాక విషయంలో ట్రాకింగ్ వుండాలని, పోలిస్ గ్రీన్ చానల్ ఏర్పాటు తో సాకాలంలో చేరుకునేలా అప్రమత్తం చేయాల్సి వుంటుందని అన్నారు. ఆక్సిజన్ అవసరాలను రాష్ట్ర స్థాయిలో అసిస్టెంట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జి.ఎం.డి.ఐ.సి. ప్రతాప్ రెడ్డి మానిటర్ చేసి లిక్విడ్ గ్యాస్ ట్యాంకర్లు రాక చూస్తారని తెలిపారు. ఏర్పేడు కృష్ణ ఫిల్లింగ్ కూడా విశాఖ నుండి లిక్విడ్ గ్యాస్ ట్యాంకర్లు వస్తే బల్క్ సిలిండర్లు ఫిల్ చేస్తారు అన్నారు. రేషనైలేజన్ వుండాలి, అత్యవసరం అయితే అందించే విధంగా, నిరతరం ఆక్సిజన్ నోడల్ అధికారులు అప్రమత్తంగా వుండాలని సూచించారు. డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్ , అర్దిఒలకు అవసరాలు తెపాలని సూచించారు.
జేసి హెల్త్ , అర్దిఓ తిరుపతి వారు మాట్లాడుతూ నిన్న ప్రత్యేకంగా డేటా ఎలా సేకరించాలని రియల్ టైం డేటా వుండేలా శిక్షణ ఇచ్చామని అన్నారు. వెబ్ మాడ్యులర్ సిద్దం అవుతున్నదని డేటా ప్రతి రెండు గంటలకు ఆసుపత్రుల ఆక్సిజన్ లెవల్స్ అప్ లోడ్ జరగాలని అన్నారు.
అర్బన్ ఎస్.పి. మాట్లాడుతూ లిక్విడ్ గ్యాస్ ట్యాంకర్లు విశాఖ , పెరంబదూరు వచ్చే ట్రాకింగ్ వివరాలు ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ అందించాలని, ఎస్కార్ట్ ఏర్పాటుతో అంతరాయం కలగకుండా చేరేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.
ఈ సమీక్షలో డి.ఎస్.పి.లు సుధాకర్ రెడ్డి, చంద్ర శేఖర్, ట్రాన్స్ పోర్ట్ అధికారులు, తహసిల్దార్ విజయసింహా రెడ్డి , ఎ.ఎస్.ఓ.మధుసూదన్ , ఎపిఎం ఐ డి సి , ఈఈ ధనంజయ రెడ్డి, రుయా ఆర్ ఎం ఓ హరికృష్ణ ,ఆరోగ్య శ్రీ జిల్లా కో ఆర్డినెటర్ డా.బాలాంజనేయులు, డ్రగ్ కంట్రోల్ అధికారిని కీర్తన, నోడల అధికారులు గా నియమింపబడిన సి.ఎస్.డి.లు, శ్యామ్ ప్రసాద్, సురేంద్ర, మల్లిఖార్జున రావు, గంగయ్య, మురళి మోహన్, యుగంధర్ , మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు.