గురువారం 3వ విడత రైతు భరోసా..


Ens Balu
2
Srikakulam
2021-05-12 15:58:55

మూడవ సంవత్సరం మొదటి విడత కార్యక్రమము గురువారం జరుగుతుందని వ్యవసాయ శాఖ ఇన్ ఛార్జ్ సంయుక్త సంచాలకులు కె.రాబర్ట్ పాల్ తెలిపారు. బుధవారం ఒక ప్రకటన జారీ చేస్తూ "వై.యస్.ఆర్ రైతు భరోసా -  పి.ఎం.కిసాన్ పథకం" కింద అర్హులైన రైతులకుఅర్హులైన సాగుదార్లకుకౌలు రైతులకు ప్రతి సంవత్సరం రూ.13,500 చొప్పునఅయిదేళ్లలో రూ. 67,500 అందించడం జరుగుతోందని చెప్పారు.  రాష్ట్రములో ఎస్సీఎస్టీబీసీమైనారిటీ కౌలు రైతులకుదేవాదాయఅటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా  రైతు భరోసాగా  సహాయాన్ని అందించడం జరుగుతోందని వివరించారు. రైతు భరోసా సొమ్మును "వై.యస్.ఆర్ రైతు భరోసా పి.ఎం.కిసాన్ పథకం" క్రింద మొదట విడతగా ఖరీప్ పంట వేసి ముందు మే నెలలో రూ.7,500, రెండో విడతగా- అక్టోబరులో ఖరీఫ్ పంట కోతకు లేదా రబీ అవసరాలకు రూ.4000; మూడో విడతగా ధాన్యం ఇంటికి చేరే వేళసంక్రాంతి పండగ సందర్భముగా రూ. 2,000 అందించడం జరుగుతోందని చెప్పారు. 2021-22 సంవత్సరం (మూడవ సంవత్సరం మొదటి విడత)లో పథకం క్రింద మొదటి విడతగా శ్రీకాకుళం జిల్లాలో 3,90,988 రైతు కుటుంబాలకు రూ. 293.24 కోట్ల మొత్తాన్ని జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇందులో రూ.216.87 కోట్లు వై.యస్.ఆర్ రైతు భరోసా కిందరూ 76.37 కోట్లు పి. ఎం. కిసాన్ పథకం కింద జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

 

ఈ పధకం కింద గత 2 సంవత్సరాలలో శ్రీకాకుళం జిల్లాలో  2019-20 సంవత్సరములో 3.34 లక్షల రైతు కుటుంబాలకు రూ.450.98 కోట్లు ఆర్ధిక సహాయంగా అందిచడం జరిగిందని, 2020 - 21 సంవత్సరంలో 3.81 లక్షల రైతు కుటుంబాలకు రూ.509 కోట్లు ఆర్ధిక సహాయం అందిచడం జరిగిందని ఆయన వివరించారు.

సిఫార్సు