టోకెన్లు ఉన్నవారే 2వ డోసు వేక్సినేషన్ కి వెళ్లాలి..


Ens Balu
4
Visakhapatnam
2021-05-12 16:14:21

విశాఖనగరంలో కోవిడ్ వేక్సినేషన్ కు సంబంధించి వార్డు వాలంటీర్లు టోకెన్లు జారీ చేసిన వారు మాత్రమే టీకా కేంద్రాలకు వెళ్లాలని అర్భన్ తహశీల్దార్ జ్నానవేణి కోరుతున్నారు. బుధవారం విశాఖలో ఈ మేరకు మీడియా ద్వారా ప్రజలకు పలు సూచనలు జారీ చేశారు. సీతమ్మధార మండలంలో స్వర్ణభారతి స్టేడియం, అక్కయ్యపాలెం, చినవాల్తేరు ప్రాంతంలో వేక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతుందన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం రెండవ డోసు టీకా మాత్రమే వేస్తున్నందున వారు మాత్రమే టీకా కోసం వెళ్లాలన్నారు. వేక్సినేషన్ కేంద్రాల వద్ద కూడా బౌతిక దూరం పాటిస్తూ, డబుల్ లేయర్ మాస్కులు ధరంచాలని, శానిటైజర్లు వినియోగించాలని తహశీల్దార్ ప్రజలకు సూచిస్తున్నారు. కరోనా వైరస్ భారిన పడకుండా టీకా వేయించుకునే సమయంలో  ప్రభుత్వం నిర్ధేశించిన సూచనలు పాటించడం ద్వారా సజావుగా రెండవ డోసు టీకా వేక్సినేషన్ సజావుగా జరుగుతుందన్నారు. వేక్సినేషన్ కేంద్రాల్లో ప్రభుత్వం అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసినట్టు జ్నానవేణి వివరించారు.
సిఫార్సు