సమాజాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ప్రశంసనీయం అని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి,వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు కొనియాడారు. గురువారం విశాఖలో నిరు పేద జర్నలిస్టులకు తన సొంత నిధులతో రూ. 1.60 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. రంజాన్ పర్వదినం సందర్బంగా 15 మంది (ముస్లిం) జర్నలిస్టులకు రూ.30 వేలు అందజేశారు. ఈసందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ పదేళ్లుగా క్రమం తప్పకుండా ప్రతియేటా రంజాన్ పర్వదినం సందర్భంగా జర్నలిస్టుల కు తనవంతు సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ప్రింట్, ఎలక్ట్రా నిక్ మీడియా కు చెందిన జర్నలిస్ట్ మిత్రుల తో పాటు చిన్న పత్రికలు, లోకల్ కెబుల్ టీవీల్లో పనిచేస్ఫో టో, వీడియో జర్నలిస్ట్ లకు తన వంతు సహాాయం దశల వారీగా అందిస్తున్నామన్నారు. ఒక నిరుపేద కుటుంబానికి 60 వేలు, ఇద్దరు చిన్న పత్రిక ల ఎడిటర్ లుకు పదివేలు చొప్పున సహాయం చేసినట్టు చెప్పారు. కేవలం జర్నలిస్టు కుటుంబాలకు తోడుగా నిలవాలనే సంకల్పంతోనే ఎందరో దాతల స్పూర్తి గా ఈ సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. గత ఏడాది కరోనా సమయం లో సుమారు రూ.12 లక్షలు వరకు వివిధ వర్గాలకు వేర్వేరు రూపాల్లో సహాయం అందచేశానన్నారు. అప్పట్లోకేవలం నిత్యా వసర వస్తువులు కోసమే 8 లక్షలు ఖర్చు చేశామన్నారు. నిరంతరం ప్రజా సేవలో కొనసాగుతున్న జర్నలిస్ట్ లును ప్రభుత్వం ఆడుకోవాలని గంట్ల కోరారు. అన్ని రకాల సదుపాయాలు కల్పించి జర్నలిస్టులకు కూడా సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. కరోనా సమయంలో జర్నలిస్ట్ లు ఫ్రంట్ లైన్ వర్కర్స్ రూపములో నిరంతరం ప్రజలు కోసం పాటు పడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ముస్లిం జర్నలిస్టులు పాల్గొన్నారు.