రాష్ట్ర ప్రజలకు అన్నం పెట్టే రైతన్నలకు సాగులో పెట్టుబడికి భరోసా కల్పించేలా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తెలిపారు. 2021-22 సంవత్సరానికి “వై.ఎస్.ఆర్. రైతుభరోసా - పి.ఎమ్. కిసాన్” పథకంలో భాగంగా తొలివిడత నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తున్న సందర్భంగా గురువారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అన్ని
జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా చెప్పిన మాట ప్రకారం ప్రకటించిన సమయానికే రైతులకు ఆర్థిక సహాయం చేస్తున్నామన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులను ఉద్థేశించి జిల్లా కలెక్టర్ పోల భాస్కర్
మాట్లాడుతూ జిల్లాలో 4,08,699 మంది రైతులు రూ. 306.55 కోట్ల మేరకు లబ్దిపొందుతున్నారని చెప్పారు. గత రెండేళ్ల కంటే ఈ సారి ఎక్కువ మంది రైతులు ప్రయోజనం పొందుతున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా 2019-20, 2020-21, 2021-22 సంవత్సరాలకు సంబం ధించి ఇప్పటివరకు రూ. 1,046 కోట్లు రైతుల ఖాతాల్లో
జమ అయినట్లు ఆయన వివరిం చారు. సాగులో నష్టాలవల్ల 2014 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ. 3.72 కోట్లు, 2018-19, 2019 ఖరీఫ్ కాలానికి పంటల బీమా ద్వారా రూ. 423.52 కోట్లు, సకాలంలో పంట రుణాలు చెల్లించిన రైతులకు ఖరీఫ్ 2019, రబీ 2019 కాలానికి రూ. 16.2 కోట్లు, 2020 సెప్టెం బరు నుంచి 2021 ఏప్రిల్ మధ్యకాలంలో తుఫానులు, ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల
పంటలు నష్టపోయిన రైతులకు రూ. 101.84 కోట్లు కలిపి మొత్తంగా జిల్లాలో రైతులకు ఇప్పటివరకు రూ. 1591.28 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం నుంచి అందించినట్లు తెలిపారు. రైతులకు అవసర మైన సేవలను గ్రామస్థాయిలోనే వారికి అందించేలా రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని కలెక్టర్ చెప్పారు. రైతులను సం ఘటిత పరిచి మరింత మేలు చేకూరేలా వారిని రైతు ఉత్పాదక సంఘాలుగా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. దీనికి తోడు సాగులో అవసరమైన సలహాలు, సూచనలను వ్యవసాయ నిపుణుల ద్వారా ఇప్పించడానికి జిల్లా కేంద్రంలో ఒక ప్రత్యేక వనరుల
కేంద్రం (డి.ఆర్.సి.) కూడా నెలకొల్పుతున్నామని తెలిపారు. మండల కేంద్రం నుంచి డి.ఆర్.సి.లోని నిపుణులతో రైతులు వీడియో ద్వారా సంభాషించి సందేహాలను నివృత్తి చేసుకునే ఈ సదుపాయాన్ని రాబోయే ఖరీఫ్ సీ జన్ కంటే ముందుగానే అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ చెప్పారు. వ్యవసాయ సలహా కమిటీలు కూడా త్వరలోనే ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. అనంతరం రైతు
భరోసా పథకంలో లబ్దిపొందిన రైతులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శాసన మండలి సభ్యురాలు పోతుల సునీత, చీరాల శాసన సభ్యులు కరణం బలరామక్రిష్ణమూర్తి, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) జె. వెంకట మురళి, డి.సి.ఎమ్.ఎస్. ఛైర్మన్ రావి రామనాథం బాబు, రైతు నాయకులు ఆళ్ల రవీంద్ర రెడ్డి, వ్యవసాయ శాఖ జె.డి. శ్రీరామమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.