ఎలాంటి విపత్కర పరిస్థితులునైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సన్నద్ధం గా ఉందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు. గురువారం పర్యాటక శాఖా మాత్యులు అధికారులు, వైద్యుల తో జిల్లాలో కోవిడ్ సేవల పై కలక్టరేట్ సమావేశ మందిరము లో సమీక్ష నిర్వహించారు. కోవిడ్ పేషెంట్లకు సేవలందించడములో ఎటువంటి సమస్యలు ఉన్నా తెలియజేయాలని ఆదేశించారు. సంబంధిత శాఖల తో మాట్లాడి పరి ష్కరిస్తానని తెలియ జేశారు. ఇప్పటి వరకు ఎంత మందికి వైద్య సేవలు తీసుకుని ఆరోగ్యంగా వచ్చారో ఆ వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో పడకలు సంఖ్య పెంచడానికి ఉన్న అవకాశాల పై చర్చించారు. వివిధ ఆసుపత్రులలో పేషెంట్లకు ఆక్సిజన్ సరఫరా విషయంలో జాగ్రత్త గా ఉండాలని 24 ఆక్సిజన్ సరఫరా పేషెంట్లకు అందాలని తెలియజేశారు. సంబంధిత సాంకేతిక నిపుణులు ఎల్లవేళలా అందుబాటులో ఉండి అప్రమత్తత తో ఉండాలని ఆదేశించారు. జిల్లాలో ఆక్సిజన్ ఎంత అవసరమో జిఎం రామలింగరాజు ను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రులలో వెంటిలేటర్ల వివరాల పై చర్చించి ఆసుపత్రుల వారీగ ఎన్ని పడకలు, ఎన్ని వెంటిలేటర్లు, ఆక్సిజన్ పడకలు సంఖ్య, మొత్తం కేసులు, తదితర వివరాలపై చర్చించారు.
విమ్స్ ఆసుపత్రి లో వైద్య సేవలు, డాక్టర్లు, నర్సులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సరఫరా తదితర విషయాలపై వివరాలను డైరక్టరు డా. రాంబాబును అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. Remidiciver injections ఆసుపత్రులకు సరఫరా చేసిన పిదప వాటిని పేషెంట్లకు వినియోగించడము పై వివరాల ను ప్రైవేట్ ఆసుపత్రుల నుండి తెప్పించు కోవాలని డ్రగ్ కంట్రోలర్ సహాయ సంచాలకులు రజితను ఆదేశించారు.
Drug ఇనస్పెక్టర్లు అందరూ ' ప్రైవేటు ఆసుపత్రులలో రెమిడిసివర్ ఇంజక్షన్ల వినియోగము పై తనిఖీలు నిర్వహించాలన్నారు. రెమిడెసివర్ వినియోగానికి కొత్తగా నియమాలు ఉన్నాయని, డిఎంహెచ్ఓ ను అడిగి తెలుసుకోవాలని డ్రగ్ కంట్రోల్ ఎడిని జెసి అరుణ్ బాబు చెప్పారు. కోవిడ్ మెటీరియల్ ప్రస్తుతం ఎంత ఉన్నది, ఇంకా ఎంత అవసరం అవుతుందని డిఎంహెచ్ఓ ను మంత్రి ప్ర శ్నించారు. డిఎమ్ అండ్ హెచ్ ఒ వివరాలను తెలుపుతూ కోవిడ్ మెటీరియల్ కొనుగోలుకు జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.. జిల్లాలో ఇప్పటి వరకు 5.22 లక్షలు మందికి మొదటి డోస్ వేయడమైనదని, 1.58 లక్షల మందికి రెండవ డోస్ వేసినట్లు తెలిపారు.
అన్ని జాగ్రత్తలు తీసుకొని మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను మంత్రి కోరారు. అంతకు ముందు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి కోవిడ్ నివారణకు జిల్లాలో తీసుకుంటున్న చర్యలను మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎం. వేణు గోపాల రెడ్డి, పి. అరుణ్ బాబు, కె జి హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మైథిలి, AMC ఫ్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్, Dm&ho డాక్టర్ సూర్యనారాయణ, చాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయ్ కుమార్, P D,, DRDA వి. విశ్వేశ్వరరావు, పలువురు జిల్లా అధికారులు, హాజరయ్యారు.
అనంతరం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విలేఖరులతో మాట్లాడుతూ 79 కోవిడ్ ఆసుపత్రులకు 79 మంది నోడల్ అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. ఆసుపత్రులకు వచ్చే కోవిడ్ పేషెంట్లకు అడ్మిషన్లు ఇవ్వాలని మెరుగైన వైద్యం అందించాలని సూచించినట్లు తెలిపారు. డాక్టర్లు, నర్సులు, టెక్నికల్ సిబ్బంది, తదితరులు అవసరమైతే నియామకాలు చేసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులను డ్రగ్ కంట్రోల్ సహాయ సంచాలకులు చూస్తారని, రెమిడెసివర్ ఇంజక్షన్లు నల్లబజారుకు వెళ్లకుండా చూడాలని ఆదేశించినట్లు తెలిపారు.
జిల్లాలో ఆరోగ్యశ్రీ ఎంప్యానల్ ఆసుపత్రులు 79 ఉన్నాయని, నాన్ ఎంప్యానల్ ఆసుపత్రులు 30 ఉన్నట్లు చెప్పారు. ఈ ఆసుపత్రుల్లో 3 వేల 809 ఆరోగ్య శ్రీ పడకలు ఉన్నాయన్నారు. 108 ఆంబులెన్స్ లు జిల్లాలో 48 తమ సేవలు అందిస్తున్నాయని వివరించారు.