విశాఖలోని సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి(సింహాద్రి అప్పన్న) చందనోత్సవం సందర్భంగా నిజరూప దర్శనం కేవలం ఇద్దరికి మాత్రమే కల్పించనున్నారు. దేవస్థాన ధర్మకర్త సంచయిత, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులకు మాత్రమే కల్పించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక జీఓ జారీచేసింది. కరోనా నేపథ్యంలో స్వామివారి చందనోత్సవం అంతా ఏకాంతంగా నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారి చందనోత్సవం యూట్యూబు ఛానల్ ద్వారా భక్తులు చూసే సౌకర్యం కల్పిస్తున్నారు. ఇతర ఏ వీఐపీలను కూడా స్వామివారి చందనోత్సవానికి అనుమతించవద్దని ఆ జీఓలో పేర్కొనడం విశేషం. స్వామివారికి పట్టు వస్త్రాలను మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి సమర్పిస్తారు. తరువాత జరిగే స్వామివారి పూజలు, అన్ని సేవలు ఏకాంతంగానే జరగనున్నాయి.