ఆరోగ్యశ్రీలో కోవిడ్ కి చికిత్సలు చేయాల్సిందే..


Ens Balu
2
Kakinada
2021-05-13 15:07:56

ఆరోగ్య శ్రీ  ఎంపెనల్మెంట్ గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రులలో 50 శాతం మేర ఆరోగ్య శ్రీ, ఈహెచ్ ఎస్ పధకాల క్రింద కోవిడ్ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులను ఆదేశించారు. గురువారం ఆరోగ్య శ్రీ పధకం  క్రింద కోవిడ్ రోగులకు చికిత్స అందించే విధంగా తాత్కాలికంగా ఆరోగ్య శ్రీ ఎంపెనల్మెంట్ గుర్తింపు పొందిన 14 ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ టెలికాన్పరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్లు కీర్తీ చేకూరి(అభివృధ్ధి), జి.రాజకుమారి(ఆసరా, సంక్షేమం) పాల్లొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ చికిత్స అందించే విధంగా 14 ప్రైవేట్ ఆసుపత్రులకు తాత్కాలిక ఆరోగ్య శ్రీ ఎంపెనల్మెంట్ గుర్తింపు ఇవ్వడం జరిగిందన్నారు. ఆరోగ్య శ్రీ ఎంపేనల్మెంట్ గుర్తింపు పొందిన అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో తప్పనిసరగా 50 శాతం మేర ఆరోగ్య శ్రీ , ఇహెచ్ఎస్ పధకాల క్రింద కోవిడ్ సోకిన వారికి చికిత్స అందించాలన్నారు. ప్రభుత్వ మార్గనిర్దేశాలు పాటించని ఆసుపత్రుల పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో  ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయకర్తలు  డా.పి.రాథాకృష్ణ (కాకినాడ), డా. పి.వి.శ్రీనివాసు (అమలాపురం), డా. పి.ప్రియాంక (రాజమహేంద్రవరం), నోడల్ అధికారులు , ఆరోగ్యశ్రీ టీమ్ లీడర్లు, ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 
సిఫార్సు