మిడ్వెస్ట్ గ్రానైట్స్ సహాయం అభినందనీయం..


Ens Balu
2
Ongole
2021-05-13 15:47:20

కరోనా బాధితులను ఆదుకునేలా సేవా గుణంతో ముందుకు రావటం గొప్ప విషయమని జిల్లా కలెక్టర్  పోల భాస్కర్ అన్నారు. ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకోసం మిడ్వెస్ట్ గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 25 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ప్రకాశం భవనంలో కలెక్టర్‌కు అందజేసింది. ఈ సందర్భంగా కలెక్టర్ మట్లాడుతూ, తీవ్ర కరోనా లక్షణాలతో చికిత్స పొందుతున్న వారికి ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రస్తుత కష్టకాలంలో దాత లు అందిస్తున్న సహకారం మరువలేనిదని కలెక్టర్ కొనియాడారు. వీరి స్ఫూర్తితో మరింత మంది ముందుకు వచ్చి సహాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో మిడ్వెస్ట్ గ్రానైట్స్ ప్రైవేటు లిమిటెడ్ యజమాని కొల్లారెడ్డి రామచంద్ర, జనరల్ మేనేజర్ డి.వి. అనిల్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సిఫార్సు