కరోనాలోనూ ఆగని స్నేక్ రెస్క్యూ..
Ens Balu
3
Visakhapatnam Steel Plant
2021-05-14 04:01:49
విశాఖలో స్నేక్ సేవర్ సొసైటీ తన సేవలను కరోనా వైరస్ అధికంగా ఉన్న సమయంలోనూ కొనసాగించడం పట్ల నగర వాసుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. అందరూ ఇంటి పట్టునే ఉన్న సమయంలో సర్పాలు వాహనాల్లోకి దూరిపోతున్నాయి. దీనితో నగర వాసులంతా స్నేక్ సేవర్ సొసైటీ నిర్వాహకు కిరణ్ ను 98491 40500 లో సంప్రదిస్తున్నారు. సర్పాల నుంచి ప్రజలను కాపడటం కోసం బాధితులు ఉండే ప్రాంతానికి వెళ్లి రెస్క్యూచేసి సర్పాలను, వాటి నుంచి ప్రజలను కాపాడుతున్నారు. శుక్రవారం సుజాతానగర్, స్టీల్ ప్లాంట్ టౌష్ లో స్కూటర్ లో దూరిన పామును చాకచక్యంగా బయటకు తీసి, దానిని క్షేమంగా అడవిలోకి విడిచి పెట్టారు. నగరపరిధిలో ఏ సమయంలోనైనా తమను సంప్రదించవచ్చునని స్నేక్ సేవర్ కిరణ కోరుతున్నారు.