విశాఖలో అరుదైన ఘట్టం..
Ens Balu
2
Simhachalam
2021-05-14 04:04:54
విశాఖలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది.. సింహాచలంలోని అప్పన్న చందనోత్సవం, రంజాన్ పండుగ, అక్షర త్రుతియలు ఒకే రోజు మే 14న రావడం. అందునా అల్లాకి శుక్రవారం అంటే ఎంతో ప్రీతికరమైన రోజు రమ్ జాన్ రావడం, శుక్రవారం రోజునే శుభ సూచికంగా అప్పన్న చందనోత్సవ నిజరూప దర్శనం, అక్షర త్రుతియ రావడం కూడా ఒక గొప్ప విషయంగా చెబుతున్నారు. అయితే ఈ మూడు పండుగలను ప్రజలు జరుపుకునే పరిస్థితి లేదు. రమ్ జాన్ పండుగను ముస్లిం సోదరులు ఇంట్లోనే చేసుకోవడం, ఇటు సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం, అక్షర త్రుతియ పూజలు కూడా భక్తులు ఇళ్లల్లో ఉండే జరుపుకోవాల్సి వచ్చింది. ఈ కరోనా తెచ్చిన ముసలం వలనే ఈ పరిస్థితి దాపురించిందనే బాధను కూడా విశాఖ వాసులు వ్యక్తం చేయడం విశేషం..